ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  పినపాక నియోజకవర్గానికి రూ.186 కోట్ల హెచ్‌ఏఎం నిధులు

పినపాక నియోజకవర్గానికి రూ.186 కోట్ల హెచ్‌ఏఎం నిధులు

బీటీ రహదారులు, వంతెనల అభివృద్ధికి భారీగా నిధులు

దసరాలోపే పనుల ప్రారంభం.. 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యత

ఆధాబ్ న్యూస్ ,పినపాక: పినపాక నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. నియోజకవర్గంలోని బీటీ రహదారులు, వంతెనలు, బ్రిడ్జిల నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం హెచ్‌ఏఎం (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) నిధుల నుంచి సుమారు రూ.186 కోట్ల భారీ నిధులు మంజూరయ్యాయి.

ఈ విషయాన్ని పినపాక ఎమ్మెల్యే వెల్లడించారు. మంజూరైన నిధులతో నియోజకవర్గంలోని అవసరమైన రహదారులు, వంతెనల అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందడంతో పాటు, గ్రామాల మధ్య రహదారి అనుసంధానం మరింత బలోపేతం కానుందని పేర్కొన్నారు.

ముఖ్యంగా దసరా పండుగలోపే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. హెచ్‌ఏఎం విధానంలో చేపట్టనున్న పనులకు సంబంధిత సంస్థలే సుమారు 15 సంవత్సరాలపాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టే విధంగా చర్యలు ఉంటాయని వివరించారు.

పినపాక నియోజకవర్గ ప్రజలు చాలాకాలంగా ఎదుర్కొంటున్న రహదారులు, వంతెనల సమస్యలకు ఈ నిధులతో పరిష్కారం లభించనుందని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇంత భారీ మొత్తంలో నిధులు మంజూరు కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి, నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు ఎమ్మెల్యే హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

“ఈ నిధులతో నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయి. రహదారులు, వంతెనల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా పనులను వేగంగా ప్రారంభిస్తాం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు