ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  జిల్లాకో మెడికల్ కాలేజ్.. విద్యార్థులకు వరం కేసీఆర్‌ పుణ్యంతో సొంత జిల్లాలోనే వైద్య విద్యకు అవకాశం

జిల్లాకో మెడికల్ కాలేజ్.. విద్యార్థులకు వరం

కేసీఆర్‌ పుణ్యంతో సొంత జిల్లాలోనే వైద్య విద్యకు అవకాశం

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (ఆధాబ్ న్యూస్):
కేసీఆర్‌ పుణ్యంతో జిల్లాకో మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటు చేయడం వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు వరంగా మారిందని . గతంలో మెడికల్‌ ఎంట్రన్స్‌ (NEET) పరీక్షలు రాయాలన్నా, కోచింగ్‌ తీసుకోవాలన్నా, వైద్య విద్య చదవాలన్నా ఖమ్మం, సూర్యాపేట, వరంగల్‌, హైదరాబాద్‌ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.

దీంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం పడటమే కాకుండా ఎంతో సమయం వృథా అయ్యేదని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఆలోచనతో ప్రతి జిల్లాకు మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటు చేసి, విద్యార్థులు తమ సొంత జిల్లాలోనే ఉంటూ పరీక్షలు రాసే, వైద్య విద్యను అభ్యసించే సౌకర్యం కల్పించారని తెలిపారు.

కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ (MBBS) సీట్ల సంఖ్య కూడా పెరిగిందని, దీనివల్ల మధ్యతరగతి, పేద విద్యార్థులకు డాక్టర్‌ అయ్యే అవకాశాలు మరింత మెరుగయ్యాయని బీఆర్‌ఎస్‌ శ్రేణులు పేర్కొన్నాయి.

మెడికల్‌ కాలేజీలతో పాటు అనుబంధంగా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం ఉచితంగా అందే అవకాశం ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా వైద్య రంగంలోకి ప్రవేశించడం సులభతరం అయ్యే విధంగా కేసీఆర్‌ చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.

విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించి, సొంత జిల్లాల్లోనే వైద్య విద్యకు అవకాశాలు కల్పించడంతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు డాక్టర్‌ కావాలనే కలను చేరువ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్‌ఎస్‌ శ్రేణులు పేర్కొన్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు