ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్‌ను అడ్డుకోలేరు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్‌ను అడ్డుకోలేరు

రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

అసెంబ్లీ ఏకపక్ష వైఖరికి వ్యతిరేకంగా కొవ్వొత్తులతో నిరసన

కరకగూడెం, సెప్టెంబర్ 08 (ఆధాబ్ న్యూస్):

అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల పోరాటాలను అడ్డుకోలేరని బీఆర్ఎస్ కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని, ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రావుల సోమయ్య మాట్లాడుతూ.. అసెంబ్లీని ప్రతిపక్షం లేకుండా కొనసాగించాలనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై నిర్బంధాలు, అరెస్టులు చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నించారు.

మహిళా ఎమ్మెల్యే పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీని రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా మార్చడం సరికాదన్నారు. రాజ్యాంగబద్ధంగా కొనసాగాల్సిన శాసనసభలో ప్రతిపక్షానికి సముచిత గౌరవం, మాట్లాడే హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజల దృష్టిని సమస్యల నుంచి మళ్లించేందుకే ప్రతిపక్ష నాయకులపై అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాటాన్ని కొనసాగిస్తుందని రావుల సోమయ్య స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులు, పోలీసుల నిర్బంధాలతో బీఆర్ఎస్ ఉద్యమాన్ని ఆపలేరన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రతిపక్షాల గొంతు నొక్కడం ఆపాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు