ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  ఉద్యోగాల పేరుతో రూ.8 కోట్ల మోసం.. నిందితుడి అరెస్ట్

ఉద్యోగాల పేరుతో రూ.8 కోట్ల మోసం.. నిందితుడి అరెస్ట్

భద్రాచలం ఆధాబ్ న్యూస్: ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 54 మంది నుంచి సుమారు రూ.8 కోట్లు వసూలు చేసిన కేసులో నిందితుడు కళ్యాణ్‌ను భద్రాచలం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించిన నిందితుడు వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టి కోల్పోయినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అప్రమత్తంగా ఉండాలని, పూర్తి వివరాలు నిర్ధారించుకున్న తర్వాతే వ్యవహరించాలని డీఎస్పీ అరుణ్ కుమార్ ప్రజలకు సూచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తుల మాటలు నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు