ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  కేజీబీవీని సందర్శించిన ఎంపీడీవో, ఏపీఎం

కేజీబీవీని సందర్శించిన ఎంపీడీవో, ఏపీఎం

కరకగూడెం, సెప్టెంబర్ 7 (ఆధాబ్ న్యూస్): కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని సోమవారం ఎంపీడీవో పి. శ్రీనివాస్, ఏపీఎం సెర్ప్ బి. వినోద్ క్రాంతి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, విద్యా బోధన తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇటీవల పంపిణీ చేసిన పాఠశాల యూనిఫామ్‌ల నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకోగా, వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో భద్రతా ప్రమాణాలు, మెనూ వివరాలు, సబ్జెక్టుల వారీగా సిలబస్‌ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం 10వ తరగతి విద్యార్థులతో తరగతి గదిలో ప్రత్యేకంగా మాట్లాడిన ఎంపీడీవో శ్రీనివాస్.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని, వాటిని సాధించేందుకు కష్టపడి చదవాలని దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక ఇన్‌చార్జి అధికారి నసీమా, జూనియర్ అసిస్టెంట్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు