కరకగూడెం మండల సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్ ప్రజావాణిలో వినతి పత్రం అందజేత .
కరకగూడెం, ఆధాబ్ న్యూస్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు కరకగూడెం మండల బీఆర్‌ఎస్ నాయకులు ప్రజావాణిలో మండలంలోని వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ఎంపీడీవో ఆఫీసులో వినతిపత్రం అందజేశారు.
మండలంలో గ్రామపంచాయతీలకు సంబంధించిన సమస్యలు, విద్యుత్ సమస్యలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు సహా ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు వంటి గ్రామపంచాయతీ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
అలాగే విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, వ్యవసాయానికి సంబంధించిన ఇబ్బందులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్తుందని మండల అధ్యక్షుడు రావుల సోమయ్య తెలిపారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు బుడగం రాము, పటన్ యాకుబ్ ఖాన్, మాజీ సర్పంచులు పాయం నరసింహారావు, పోలెబోయిన నరసింహారావు, మండల నాయకులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, అత్తె సత్యనారాయణ, యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్, కటకం లెనిన్, గాంధర్ల సతీష్, తోలెం రామారావు, పడిగా అశోక్, ఈసం రఘు, సయ్యద్ పాషా తదితరులు పాల్గొన్నారు.









