ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి
– జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్ సెప్టెంబర్ 6: సెప్టెంబర్ 7న సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 10 గంటలకు సకాలంలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.
ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన లిఖితపూర్వక ఫిర్యాదులను ప్రజావాణిలో సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారులు వెంటనే స్వీకరించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లోనూ ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.









