ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  1000 రోజుల కాంగ్రెస్ పాలనపై మణుగూరులో బీఆర్‌ఎస్ యువజన పోరుబాట తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేత

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై మణుగూరులో బీఆర్‌ఎస్ యువజన పోరుబాట

తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేత

మణుగూరు,ఆధాబ్ న్యూస్, : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ యువజన విభాగం నాయకులు విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన పోరుబాటలో భాగంగా శనివారం మణుగూరులో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

మణుగూరులోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు యువజన నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌కు నిరుద్యోగుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ యువజన నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఏటా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, యువతకు వడ్డీ లేకుండా రూ.10 లక్షల రుణాలు అందిస్తామని హామీ ఇచ్చిందన్నారు.

అదేవిధంగా జిల్లాకు ఇంటర్నేషనల్ స్కూళ్లు, నియోజకవర్గంలో క్రీడాకారుల కోసం ప్రత్యేక అకాడమీ, విద్యార్థులకు ఉచిత స్కూటర్లు అందిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి కింద రూ.8,832 కోట్లు బకాయి పడ్డాయని ఆరోపించారు.

కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగుల పరిస్థితి “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్న చందంగా మారిందని నాయకులు అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళల తరఫున బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, కరకగూడెం, పినపాక మండలాల బీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షులు భోశెట్టి రవి ప్రసాద్, గుర్రం సృజన్, గద్దల రామకృష్ణ, గుడ్ల రంజిత్ కుమార్, చెన్న కేశవులు, జిల్లా యువజన నాయకులు పద్దం శ్రీనివాస్, ఆవుల శ్రీను, జక్కం రంజిత్, సూర్యం, నజీర్ సోను, చల్లా రాజేష్, పవన్, డేగల సంపత్, బాజీ, బోశెట్టి దీపక్, సతీష్, సాధనపల్లి లక్ష్మీనారాయణ తదితరులు, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు