పోలీస్ ఉచిత కోచింగ్ పరీక్షకు అభ్యర్థులు హాజరు కావాలి
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలానికి చెందిన పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు ఈ నెల 06.09.2026న మణుగూరులో ఉచిత పోలీస్ కోచింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్ఐ పివిన్ రావు తెలిపారు. అభ్యర్థులందరూ ఉదయం 7 గంటలకు హాల్‌టికెట్‌తో పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని సూచించారు.
హాల్‌టికెట్ లేకుండా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని తెలిపారు. హాల్‌టికెట్ నంబర్ల ఆధారంగా అభ్యర్థులకు పరీక్షా గదులు కేటాయిస్తామని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు.
అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలని, పెన్సిల్ వాడకూడదని సూచించారు. OMR షీట్‌ను స్పష్టంగా, పూర్తిగా నింపాలని, ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు గుర్తిస్తే ఆ ప్రశ్నను తప్పుగా పరిగణిస్తామని తెలిపారు.
OMR షీట్‌పై మడతలు పెట్టడం, పిన్ చేయడం, అనవసర గుర్తులు వేయడం, వైట్నర్, బ్లేడ్ లేదా ఎరేజర్ ఉపయోగించడం నిషేధమన్నారు. హాల్‌టికెట్ నంబర్, పేరు తదితర వివరాలను OMR షీట్లో నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే నమోదు చేయాలని సూచించారు.
పరీక్ష పూర్తయిన అనంతరం OMR షీట్‌ను తప్పనిసరిగా ఇన్విజిలేటర్‌కు అప్పగించాలని, ప్రశ్నపత్రం లేదా OMR షీట్‌ను పరీక్షా గది నుంచి బయటకు తీసుకెళ్లరాదని తెలిపారు.
అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఐ పివిన్ రావు తెలిపారు. అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షకు హాజరై, పరీక్షను విజయవంతంగా పూర్తి చేయాలని ఆయన కోరారు.









