ప్రతి క్షణం
ప్రజల పక్షం

వెళ్లి రావమ్మా.. బతుకమ్మ.. ఘనంగా బతుకమ్మలకు వీడ్కోలు పలికిన మహిళలు పార్టీ లైన్‌ దాటితే ఉపేక్షించేది లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా వేటు తప్పదు బీఆర్‌ఎస్‌ నుంచి కరకగూడెం ఉపసర్పంచ్‌ బుడగం రాము సస్పెన్షన్‌ క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి – విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ కరకగూడెం పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విధుల పట్ల నిర్లక్ష్యంపై చర్యలు.. మెడికల్ ఆఫీసర్‌కు ఛార్జ్ మెమో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి: కలెక్టర్ అంకిత్ రవిచంద్ర మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాడి శ్రీనివాస్

  ఆరు గ్యారంటీల అమలుకు బీఆర్ఎస్ నిరసన మండల కేంద్రంలో ప్లకార్డులతో నిరసన.. రాస్తారోకో

ఆరు గ్యారంటీల అమలుకు బీఆర్ఎస్ నిరసన

మండల కేంద్రంలో ప్లకార్డులతో నిరసన.. రాస్తారోకో

కరకగూడెం, సెప్టెంబర్ 4 (ఆధాబ్ న్యూస్):
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో నిరసన, రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ మహిళలు, నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కేటీఆర్ ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సూచనలతో మండల అధ్యక్షులు రావుల సోమయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రేగా కాళిక మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 జీవనభృతి, తులం బంగారం, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందించాలని కోరారు. అలాగే యువతకు వడ్డీ లేని రూ.10 లక్షల రుణాలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు.

ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆమె విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరింత ఉద్యమం చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు పాయం క్రిష్ణవేణి, కొమరం విజయ, పోలెబోయిన రాణి, రేగా శ్వేత, గొగ్గల మల్లేశ్వరి, చందా విజయలక్ష్మి, పోలెబోయిన సంధ్యరాణి, కోమరం కవిత, చందా వసంత, సోయం అంజని, వట్టం సందీప్, ఉప సర్పంచులు మంచాల లామణ్య, బుడగం రాము, యాకుబ్ ఖాన్, కొప్పు కాంతారావు, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు, మాజీ సర్పంచులు ఊకే రామానాథం, పాయం నర్సింహారావు, కొమరం విశ్వనాథం, కొమరం శ్రీను, చందా వసంతారావు, మాజీ ఉప సర్పంచులు అక్కిరెడ్డి మాధవి, అత్తె సత్యనారాయణ, పోగు వెంకటేశ్వర్లు, యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్, మండల నాయకులు ఎల్లు రామకృష్ణ, యగ్గడి శ్రీను, గాందర్ల సతీష్, తాటి వెంగళరావు, తోలెం రామారావు, బత్తని సీతయ్య, అత్తె ముకుందా, కొమ్మ ప్రసాద్, పోలెబోయిన కార్తిక్, ప్రభాకర్ తదితరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు