ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  పెద్ది సుదర్శన్ రెడ్డికి 72 గంటల న్యూరోలాజికల్ రీ-అసెస్‌మెంట్ అనంతరమే కోలుకునే అవకాశాలపై స్పష్టత: యశోద ఆసుపత్రి

 

పెద్ది సుదర్శన్ రెడ్డికి 72 గంటల న్యూరోలాజికల్ రీ-అసెస్‌మెంట్ అనంతరమే కోలుకునే అవకాశాలపై స్పష్టత: యశోద ఆసుపత్రి

హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద ఆసుపత్రి యాజమాన్యం – శ్వాసక్రియ స్థిరంగా ఉన్నా మెదడు స్పందనపై ఆందోళన

హైదరాబాద్, ఆధాబ్ న్యూస్: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి యాజమాన్యం మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.

బులెటిన్ ప్రకారం, ఊపిరితిత్తుల్లో భారీ రక్తగడ్డలు (మాసివ్ పల్మనరీ ఎంబోలిజం) ఏర్పడి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు వరంగల్‌లో అత్యవసర చికిత్స అందించిన అనంతరం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతుండగా, శ్వాసక్రియ (రెస్పిరేటరీ ఫంక్షనింగ్), రక్తపోటు వంటి కీలక శారీరక విధులు వైద్యుల పర్యవేక్షణలో స్థిరంగా ఉన్నాయని పేర్కొన్నారు.

అయితే గుండె ఆగిన సమయంలో కొంతసేపు మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో మెదడు దెబ్బతిన్నట్లు (అనాక్సిక్ బ్రెయిన్ ఇంజరీ) పరీక్షల్లో సంకేతాలు కనిపించాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం మత్తు మందులు లేకపోయినా మాటలకు, నొప్పికి ఆయన స్పందించడం లేదని తెలిపారు.

EEG, MRI, CT స్కాన్ తదితర పరీక్షల ఆధారంగా అంతర్జాతీయ వైద్య మార్గదర్శకాల ప్రకారం 72 గంటల న్యూరోలాజికల్ రీ-అసెస్‌మెంట్ నిర్వహించిన తర్వాతే ఆయన కోలుకునే అవకాశాలపై స్పష్టమైన అంచనా వేయగలమని వైద్యులు వెల్లడించారు.

కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్య పరిస్థితి, చికిత్స పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు యశోద ఆసుపత్రి యాజమాన్యం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….