ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  ఆర్చరీలో మెరిసిన ఆదివాసి ఆణిముత్యం – జాతీయ స్థాయికి అశ్విత్ దొర ఎంపిక

ఆర్చరీలో మెరిసిన ఆదివాసి ఆణిముత్యం – జాతీయ స్థాయికి అశ్విత్ దొర ఎంపిక
కరకగూడెం,ఆధాబ్,న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసి యువ క్రీడాకారుడు కొమరం అశ్విత్ దొర ఆర్చరీ క్రీడలో ప్రతిభ చాటుతూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఈనెల 26 నుండి 29 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా ట్రైబల్ జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురు ట్రైబల్ క్రీడాకారులు ఎంపిక కాగా, వారిలో అశ్విత్ దొర చోటు దక్కించుకోవడం విశేషం.

అశ్విత్ దొర తాటిగూడెం గ్రామానికి చెందిన కొమరం వెంకటనారాయణ కుమారుడు. వెంకటనారాయణ భద్రాచలం ఐటిడిఏలో అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్నప్పటి నుంచే ఆర్చరీపై ఆసక్తి చూపుతున్న అశ్విత్ దొర ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ అద్భుత ప్రతిభ కనబరిచి పలువురి ప్రశంసలు అందుకున్నారు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన అశ్విత్ దొరను తల్లిదండ్రులు, గ్రామస్తులు, క్రీడాభిమానులు మరియు ఆర్చరీ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే పోటీల్లో అశ్విత్ దొర మరింత ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అడవుల మధ్య పెరిగిన ఒక ఆదివాసి యువకుడు తన కృషి, పట్టుదలతో జాతీయ స్థాయికి చేరుకోవడం స్థానిక యువతకు ప్రేరణగా నిలుస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….