ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రెండో రోజు ఉత్సాహంగా జర్నలిస్ట్ కప్ క్రికెట్ పోటీలు

రెండో రోజు ఉత్సాహంగా జర్నలిస్ట్ కప్ క్రికెట్ పోటీలు

పినపాక, ఆధాబ్ న్యూస్
పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్చిరెడ్డిపల్లి క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న జర్నలిస్ట్ కప్ క్రికెట్ టోర్నమెంట్ రెండో రోజు పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ సందర్భంగా మణుగూరు ఎక్సైజ్ సీఐ రాజిరెడ్డి, ఎస్ఐలు సురేష్, నాగుల్ మీరా గౌరవ అతిథులుగా హాజరై ఆటల్లో పాల్గొని ప్రేక్షకులను అలరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు, అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య ఐక్యతను పెంపొందించడం, క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ అభినందనీయమని తెలిపారు. పోటీలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆడి విజయం సాధించాలని సూచించారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న కమిటీకి అభినందనలు తెలిపారు.

రెండో రోజు జరిగిన మ్యాచ్‌లలో పినపాక ప్రజాప్రతినిధులు – కరకగూడెం జర్నలిస్టుల మధ్య జరిగిన మ్యాచ్‌లో కరకగూడెం జర్నలిస్టులు విజయం సాధించారు. ఉపాధ్యాయులు – బిటిపిఎస్ జెపిఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బిటిపిఎస్ జెపిఎ జట్టు గెలుపొందింది. పినపాక పోలీస్ – కరకగూడెం ఎంపీడీవో కార్యాలయ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పోలీస్ జట్టు విజయం సాధించింది. ఎక్సైజ్ విభాగం – పినపాక ఎంపీడీవో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పినపాక ఎంపీడీవో జట్టు గెలిచింది.

కరకగూడెం ప్రెస్ క్లబ్ కెప్టెన్ దుర్గం ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో సురేష్, ప్రవీణ్, సురేందర్, రంజిత్, దిలీప్, హనుమంతరావు, ప్రవీణ్ ఫరూఖ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. అతిథులు విజేతలకు బహుమతులు అందజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!