ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మోతే గ్రామంలో హ్యాండ్ బోర్ పనులకు శ్రీకారం

మోతే గ్రామంలో హ్యాండ్ బోర్ పనులకు శ్రీకారం

కరకగూడెం, ఫిబ్రవరి 17 (ఆధాబ్ న్యూస్):
కరకగూడెం మండలం కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మోతే గ్రామంలో హ్యాండ్ బోర్ ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సర్పంచ్ పోలేబోయిన సుజాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ముత్యాలమ్మ గుడి ఆవరణలో భక్తుల సౌకర్యార్థం మరియు గ్రామ ప్రజల త్రాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని హ్యాండ్ బోర్ ఏర్పాటు అవసరమని స్థానికులు సర్పంచ్ దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో చర్చించి ఎంపీపీ నిధుల ద్వారా పనులను మంజూరు చేయించారు.

మంగళవారం పూజా కార్యక్రమం నిర్వహించి హ్యాండ్ బోర్ తవ్వక పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోలేబోయిన సుజాత, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముత్యాలమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు, అలాగే గ్రామ ప్రజలకు త్రాగునీటి సమస్యకు ఈ బోర్ ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు అక్కిరెడ్డి నిర్మల, సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు, ఎల్లి సోమిరెడ్డి, బుడగం వెంకన్న, అక్కిరెడ్డి మల్లారెడ్డి, వాసిరెడ్డి రాజేందర్, గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!