భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర రక్తదానం
భద్రాచలం,ఆధాబ్ న్యూస్: సాగర్ బ్లడ్ బ్యాంక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరోసారి మానవత్వం వెలుగొందింది. భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పొడియం మంగ అనే రోగికి అత్యవసరంగా O+ పాజిటివ్ రక్తం అవసరమని సమాచారం అందడంతో, హేమంత్ రెడ్డి వెంటనే స్పందించి ఆస్పత్రికి చేరుకుని రక్తదానం చేశారు.
ఈ రక్తదానం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడిన హేమంత్ రెడ్డి సేవను రోగి కుటుంబ సభ్యులు అభినందించారు. అలాగే సాగర్ బ్లడ్ బ్యాంక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరింత మంది రక్తదాతలు ముందుకు రావాలని అసోసియేషన్ కోరింది.
ఈ సందర్భంగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి. విశ్ణు (ఫోన్: 93987 51382) మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ప్రాణాలను కాపాడగల గొప్ప సేవ అని తెలిపారు.









