ప్రతి క్షణం
ప్రజల పక్షం

  శివరాత్రి సందర్భంగా అనంతారం రామాలయానికి అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.1,00,116 విరాళం.

శివరాత్రి సందర్భంగా అనంతారం రామాలయానికి అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.1,00,116 విరాళం.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం
శివరాత్రి సందర్భంగా అనంతారం గ్రామంలోని రామాలయానికి అమ్మానాన్న చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ జాడి మాధవరావు రూ.1,00,116/- విరాళం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ కన్నతల్లిని, మన పుట్టిన ఊరిని ఎప్పటికీ మరవకూడదని అన్నారు. “ఈ ఊరు మాకు ఎంతో ఇచ్చింది… అందుకే మేము కూడా మా వంతుగా ఊరికి ఏదో ఒకటి ఇవ్వాలని ఎప్పుడూ తపనపడుతుంటాము” అని పేర్కొన్నారు.

అదేవిధంగా, చదువు కోలేని పేద పిల్లలకు ఆర్థిక సహాయం అందించేందుకు తమ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ప్రతి సంవత్సరం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారు రూ.కోటి వరకు ఖర్చు చేసి, పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తున్నామని చెప్పారు. వారికి మూడు పూటల భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామని వివరించారు.

తమ వద్ద చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం మంచి స్థాయిలో ఉద్యోగాలు సంపాదించి, సమాజంలో ప్రయోజకులుగా నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత మంది పేద విద్యార్థులకు సహాయం అందిస్తూ, సమాజానికి ఉపయోగపడే విధంగా ట్రస్ట్ సేవలు విస్తరించనున్నట్లు తెలిపారు.
ట్రస్ట్ సభ్యులు:
డా. జాడి మురళీధర్ (ప్రెసిడెంట్),
డా. జాడి నరసింహరావు (జనరల్ సెక్రటరీ),
జాడి కోటేశ్వరరావు (ఎగ్జిక్యూటివ్ మెంబర్),
శ్రీమతి డా. జాడి పూజా మాధవ్ (వైస్ ప్రెసిడెంట్),
జాడి దేవేంద్ర వర ప్రసాద్ (జాయింట్ సెక్రటరీ),
జాడి రామనాథం (ఎగ్జిక్యూటివ్ మెంబర్).
ఈ కార్యక్రమంలో అనంతారం గ్రామస్తులు అత్తే నాగేశ్వరరావు, కొమ్మ ప్రసాద్, చెన్నోజు రాజేశ్వరరావు, అత్తే సారయ్య, పూజారి వెంకన్న, మొగిలిపువ్వు వెంకన్న, సలుగు భిక్షపతి (మాజీ ఉప సర్పంచ్), అత్తే సత్యనారాయణ, పసునూరి అంజయ్య, కటకం నరసింహులు, చేన్నోజు శంకరయ్య గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!