ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఎస్సై పి.వి.ఎన్. రావు ఆధ్వర్యంలో గుడుంబా పై దాడులు.. 1200 లీటర్ల బెల్లం పాకం ధ్వంసం

ఎస్సై పి.వి.ఎన్. రావు ఆధ్వర్యంలో గుడుంబా పై దాడులు.. 1200 లీటర్ల బెల్లం పాకం ధ్వంసం

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం పోలీస్ స్టేషన్ ఎస్సై పి.వి.ఎన్. రావు ఆధ్వర్యంలో మండలంలోని కన్నాయిగూడెం అటవీ ప్రాంతంలో గుడుంబా తయారీపై పోలీసులు దాడులు నిర్వహించారు. గుడుంబా తయారు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

దాడుల్లో సారా తయారీకి ఉపయోగిస్తున్న సుమారు 1200 లీటర్ల బెల్లం పాకం నిల్వ ఉంచిన డ్రమ్ములను పోలీసులు పగలగొట్టారు. అలాగే సారా కాచేందుకు ఉపయోగించే బిందెలు, గిన్నెలను కూడా అక్కడికక్కడే ధ్వంసం చేశారు.

మండలంలో ఎవరైనా గుడుంబా తయారు చేయడం లేదా విక్రయించడం జరిగితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పి.వి.ఎన్. రావు హెచ్చరించారు. ప్రజలు కూడా సహకరించి, గుడుంబా తయారీ లేదా విక్రయం గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

సమాచారం అందించేందుకు ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు:
📞 8712682102
📞 8712682103

ప్రజల సహకారంతో మండలాన్ని మద్యం అక్రమాల నుంచి నిర్మూలిస్తామని పోలీసులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!