మండలంలో దోమల విపరీత విజృంభణ.. ప్రజలు ఇబ్బందులు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని ప్రతి గ్రామాల్లో దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సాయంత్రం వేళ అయితే చాలు దోమలు ఇళ్లలోకి పెద్ద ఎత్తున ప్రవేశించి చిన్నపిల్లలు, వృద్ధులను కుట్టుతూ నిద్ర లేకుండా చేస్తున్నాయి.
దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారులు ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలు
తక్షణమే తీసుకుని గ్రామాల్లో ఫాగింగ్ చేయాలని, డ్రైనేజీ కాలువలు శుభ్రం చేసి నిల్వ నీరు లేకుండా చూడాలని ప్రజలు మండల అధికారులను కోరుతున్నారు.
Post Views: 73









