కరకగూడెం మండలంలో గుడుంబా తయారీపై పోలీసుల దాడులు
– ఎస్సై పి.వి.ఎన్. రావు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం పోలీస్ స్టేషన్ ఎస్సై పి.వి.ఎన్. రావు ఆధ్వర్యంలో మండల పరిధిలో అక్రమ గుడుంబా తయారీపై కఠిన చర్యలు చేపట్టారు. కౌలూరు–కలవల నాగారం గ్రామాల మధ్య ప్రవహిస్తున్న పెద్ద వాగు సమీపంలో గుడుంబా తయారు చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో సారా తయారీకి ఉపయోగిస్తున్న సుమారు 1000 లీటర్ల బెల్లం పాకాన్ని నిల్వ ఉంచిన డ్రమ్ములను అక్కడికక్కడే పగలగొట్టారు. అలాగే సారా కాచేందుకు ఉపయోగించే బిందెలు, గిన్నెలు తదితర సామగ్రిని కూడా ధ్వంసం చేశారు.
కరకగూడెం మండలంలో ఎవరైనా సారా కాచినా లేదా విక్రయించినా, వారి పై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్సై పి.వి.ఎన్. రావు హెచ్చరించారు.
అక్రమ సారా తయారీ లేదా విక్రయానికి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే కరకగూడెం పోలీసులకు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు.
సమాచారం ఇవ్వవలసిన ఫోన్ నంబర్లు:
📞 8712682102
📞 8712682103









