ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు – ఫిబ్రవరి 9 నుంచి స్వీకరణ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు – ఫిబ్రవరి 9 నుంచి స్వీకరణ
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28 కాలానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల గడువు ఫిబ్రవరి 28తో ముగియనున్నందున, అర్హత కలిగిన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారికి సమర్పించాలని సూచించారు. యాజమాన్యాల ద్వారా పంపబడిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్‌సైట్ http://ipr.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఫిబ్రవరి 9 నుంచి జిల్లా స్థాయిలో ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని, అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రకటనలో కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!