పినపాక, కరకగూడెం, జానంపేట పీహెచ్సీల ఆకస్మిక తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ జిల్లాలోని పినపాక, కరకగూడెం, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని బట్టుపల్లి ఉపకేంద్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడ నిర్వహించిన ‘డ్రైడే–ఫ్రైడే’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు ఆరోగ్య కార్యక్రమాల అమలుపై అవగాహన కల్పించారు. వైద్య సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, హాజరు పట్టికను సక్రమంగా నిర్వహించాలని, రోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అవసరమైన వైద్య సేవలను సమర్థవంతంగా అందించాలని సూచించారు.
అలాగే జిల్లాలో సిజేరియన్ కాన్పుల సంఖ్యను తగ్గించి, సాధారణ కాన్పులు ఎక్కువగా జరిగేలా గర్భిణీలను ప్రోత్సహించాలని వైద్యాధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 79









