యూరియా బుకింగ్ యాప్‌తో పారదర్శక పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా బుకింగ్ యాప్‌ను విజయవంతంగా అమలు చేస్తూ రైతులకు అవసరానికి అనుగుణంగా ఎరువుల పంపిణీ జరుగుతోందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
ప్రస్తుత సీజన్లో జిల్లావ్యాప్తంగా 5,826 మంది రైతులు 5,859 బుకింగ్స్ ద్వారా 27,782 యూరియా బస్తాలు బుక్ చేయగా, వాటిలో 19,173 బస్తాలు ఇప్పటికే కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇందులో పీపిబి, ఎన్డీఎస్ రైతులతో పాటు కౌలుదారుల రైతులు కూడా ఉన్నారని చెప్పారు.
యాప్ అమలుతో ఎరువుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట పడటంతో పాటు, పంట అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా సాధ్యమవుతోందని అధికారులు తెలిపారు. రైతులు తప్పనిసరిగా అధికారిక యూరియా బుకింగ్ యాప్ ద్వారానే బుకింగ్ చేయాలని వ్యవసాయ శాఖ కోరింది.
Post Views: 27









