దమ్మపేటలో ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ – ముగ్గురు నిందితులు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లు చోరీ చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 90 కిలోల కాపర్ వైర్లు, వైర్ కట్టర్లు, గడ్డ పలుగు, మూడు సెల్ఫోన్లు మరియు ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, అరెస్ట్ అయిన నిందితులు కాకినాడ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, కరకగూడెం, ములకలపల్లి, ఈబయ్యారం గ్రామాల పరిధిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్లు చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ కేసులో నిందితులను బొగ్గుల సాయి, కిషోర్ రెడ్డి, లక్ష్మణ్ రామకృష్ణారెడ్డి, కలేశావళి రమేష్, నాగముత్యం లను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.









