ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ప్రేమ వ్యవహారంలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

ప్రేమ వ్యవహారంలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వరంగల్ ,ఆధాబ్ న్యూస్:
ఇద్దరు యువకుల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలకలం రేపింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత (మహిళా కానిస్టేబుల్) వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తోంది.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్ అనే వ్యక్తి, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నాలుగేళ్లుగా అనితను వేధించినట్లు పోలీసులు తెలిపారు. డ్యూటీలో ఉన్నప్పటికీ వీడియో కాల్ చేయాలని, ఇతరులతో స్నేహంగా మాట్లాడవద్దని అనుమానంతో వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

రాజేందర్ ప్రవర్తన నచ్చక అనిత తల్లిదండ్రులు అతనితో వివాహానికి నిరాకరించారు. ఈ క్రమంలో అనిత తన స్నేహితుడు జబ్బార్ లాల్‌తో సన్నిహితంగా ఉంటోందని రాజేందర్ గుర్తించి, అతనికి అనితపై తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జబ్బార్ లాల్ కూడా అనితను వేధించడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

డబ్బులు ఇస్తేనే వివాహం చేసుకుంటానని జబ్బార్ లాల్ బెదిరింపులకు పాల్పడటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన అనిత, రాజేందర్‌కు ఫోన్ చేసి మీ ఇద్దరి వల్ల నా జీవితం నాశనమైందని, చావే దిక్కని వాపోయినట్లు సమాచారం. అయితే రాజేందర్ నిర్లక్ష్యంగా స్పందించడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన అనిత గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై రాజేందర్, జబ్బార్ లాల్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వరంగల్ పోలీసులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!