మేడారానికి TGSRTC ప్రత్యేక బస్సులు.. టికెట్ ధరలు ప్రకటింపు
మేడారం,ఆధాబ్ న్యూస్:
సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర-2026 సందర్భంగా భక్తుల సౌకర్యార్థం TGSRTC అధికారులు ప్రత్యేక బస్సు సేవలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి నడిచే ప్రత్యేక బస్సుల టికెట్ ఛార్జీల పట్టికను విడుదల చేశారు.
అధికారులు ప్రకటించిన ధరల ప్రకారం ఖమ్మం నుంచి మేడారానికి టికెట్ ధరను రూ. 480గా నిర్ణయించారు. కొత్తగూడెం నుంచి రూ. 350, పాల్వంచ నుంచి రూ. 310, మణుగూరు నుంచి రూ. 210గా ఖరారు చేశారు. అలాగే భద్రాచలం నుంచి రూ. 300, ఇల్లందు నుంచి రూ. 400గా నిర్ణయించగా, ఇల్లందు వయా గుండాల మార్గంలో మేడారానికి టికెట్ ధరను రూ. 270గా ప్రకటించారు.
జాతరకు వచ్చే భక్తులు ఈ ప్రత్యేక బస్సు సేవలను వినియోగించుకోవాలని TGSRTC అధికారులు సూచించారు.
Post Views: 55









