పేద కుటుంబానికి ఆశాకిరణం.. అనారోగ్య బాధితురాలికి రూ.3 లక్షల ఎల్ఓసి మంజూరు చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో మానవత్వానికి మరోసారి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
కరకగూడెం మండలం, అనంతారం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఇర్ప గీతా (W/o ఇర్ప పుల్లయ్య) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్న కుటుంబానికి ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే స్పందించారు.
మానవతా దృక్పథంతో ముందుకొచ్చిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, బాధితురాలి చికిత్స నిమిత్తం రూ.3 లక్షల ఎల్ఓసి (LOC) మంజూరు చేయించారు. ఈ సహాయంతో ఆ కుటుంబానికి పెద్ద ఊరట లభించిందని స్థానికులు తెలిపారు.
ప్రజల కష్టసుఖాల్లో వెంటనే స్పందిస్తూ అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే చర్యపై కరకగూడెం మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవాభావం మరెందరికో ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు .









