ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  KLRఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా – పలువురు విద్యార్థులకు గాయాలు

KLRఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా – పలువురు విద్యార్థులకు గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఇంజినీరింగ్ కాలేజీ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటన చోటుచేసుకుంది. మణుగూరు నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న KLR ఇంజినీరింగ్ కళాశాల బస్సు అటవీ ప్రాంతానికి చేరుకున్న సమయంలో అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడినట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 60 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని చూసిన స్థానికులు, దారిలో వెళ్తున్న ప్రయాణికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడిన విద్యార్థులను అత్యవసర వాహనాల్లో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.

తల్లిదండ్రుల ఆవేదన

ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….