ప్రతి క్షణం
ప్రజల పక్షం

  నూతన సంవత్సర సందర్భంగా ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన మణుగూరు డివిజన్ పోలీస్, అటవీ శాఖ అధికారులు

మణుగూరు,ఆధాబ్ న్యూస్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మణుగూరు డివిజన్‌కు చెందిన పోలీస్, అటవీ శాఖ అధికారులు మరియు సిబ్బంది స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజల భద్రత, అటవీ పరిరక్షణతో పాటు ప్రాంత అభివృద్ధికి శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.

ఎమ్మెల్యే అధికారులను అభినందిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీస్, అటవీ శాఖల పాత్ర కీలకమని పేర్కొన్నారు. శాంతిభద్రతలు, పర్యావరణ సంరక్షణ అంశాల్లో సహకారం మరింత పెంచాలని సూచించారు.

ఈ మర్యాదపూర్వక భేటీలో మణుగూరు డివిజన్‌కు చెందిన తెలంగాణ పోలీస్ మరియు తెలంగాణ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!