ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా

కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

నేతలు మాట్లాడుతూ—దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. గ్రామీణ పేదల ఉపాధి హక్కులను కాపాడాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!