ఏరు ఫెస్టివల్‌లో గిరిజనులతో కలెక్టర్ నృత్యం
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
దుమ్ముగూడెం మండలం బోజ్జిగుప్పలో నిర్వహించిన ‘ఏరు రివర్ ఫెస్టివల్’లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ఫైర్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గిరిజనులతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు.
జిల్లాలో పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ పర్యాటకాభివృద్ధి చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ ‘ఏరు రివర్ ఫెస్టివల్’ ద్వారా గిరిజన జీవన విధానం ప్రజలకు చేరువ అవుతుందని ఆయన పేర్కొన్నారు.
Post Views: 63









