ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సర్పంచ్–ఉపసర్పంచ్
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలానికి చెందిన రఘునాధపాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ పోలబోయిన రాణి, ఉపసర్పంచ్ కొప్పు క్రాంతి పంచాయతీకి వచ్చే నిధుల కోసం ఎదురుచూడకుండా, పూర్తిగా తమ సొంత ఖర్చులతో పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు. పద్మపురం–వెంకట్రాంపురం రావాదారిని ఎన్నికల్లో గెలిచిన వెంటనే రూ.30 వేల వ్యయంతో ఆ రహదారి మరమ్మత్తుల కోసం రెండు కిలోమీటర్ల మేర పనులు చేపట్టారు. అభివృద్ధి పనులు పూర్తికావడంతో గ్రామానికి రాకపోకలు మెరుగుపడగా, ఈ సందర్భంగా గ్రామస్తులు సర్పంచ్–ఉపసర్పంచ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
Post Views: 124









