దమ్మపేటలో భారీగా గంజాయి పట్టివేత
పాల్వంచ,ఆధాబ్ న్యూస్:
దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. వాహన తనిఖీల సందర్భంగా దమ్మపేట పోలీసులు 36 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇదే కాకుండా, ఇటీవల నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో మొత్తం రూ. కోటి యాభై లక్షల విలువైన 304 కేజీల నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ విజయవంతమైన ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన దమ్మపేట SI సాయి కిషోర్ రెడ్డి, అశ్వారావుపేట CI నాగరాజు రెడ్డి మరియు పోలీస్ సిబ్బందిని కొత్తగూడెం DSP రెహమాన్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు.
అక్రమ మాదక ద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.









