ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మోతే గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ దొంగతనం ప్రయత్నం – అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచన

మోతే గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ దొంగతనం ప్రయత్నం – అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచన
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
మోతే గ్రామంలో నిన్న రాత్రి (మంగళవారం) గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ఫార్మర్‌ను దొంగతనం చేయడానికి ప్రయత్నించిన ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీస్ అధికారులు, కరెంటు డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు.

అయితే పోలీసుల రాకను గమనించిన దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొంది.
అక్కడున్న రైతులు వెంటనే సమాచారం ఇవ్వడంతో అధికారులు త్వరగా స్పందించగలిగారు. రాత్రి సమయాల్లో వ్యవసాయ పొలాలు, ట్రాన్స్ఫార్మర్లు ఉన్న ప్రాంతాల్లో రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు లేదా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

గ్రామస్తుల సహకారంతోనే ఇలాంటి ఘటనలను అడ్డుకోవడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!