ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వనపర్తి వ్యవసాయ అధికారి లంచం తీసుకుంటూ ACBకి పట్టుబాటు

వనపర్తి వ్యవసాయ అధికారి లంచం తీసుకుంటూ ACBకి పట్టుబాటు
వనపర్తి,ఆధాబ్ న్యూస్:
వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖలో అవినీతి బట్టబయలైంది. వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి పుప్పాల ఆంజనేయులు గౌడ్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు చిక్కాడు.

ఫిర్యాదుదారునికి ఎటువంటి ఆటంకం లేకుండా క్రమం తప్పకుండా యూరియా ఎరువులు సరఫరా చేస్తానని హామీ ఇచ్చిన ఆ అధికారి, ఇందుకు గాను రూ.20,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ముందుగా రూ.3,000 స్వీకరించిన అతడు, మిగిలిన మొత్తంలో నుండి రూ.10,000 తీసుకుంటుండగా ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

లంచం డిమాండ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, సాక్ష్యాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్న ACB అధికారులు, ఇది స్పష్టమైన అవినీతి కేసుగా భావించి అధికారిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతోంది.

ప్రజలకు ACB హెచ్చరిక

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోరితే వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని ACB అధికారులు సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని వారు స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!