రియల్ హీరో సోను సూద్ మంచి మనసు
ఆధాబ్ న్యూస్ ,వెబ్ డెస్క్:
ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలతో రియల్ లైఫ్ హీరోగా గుర్తింపు పొందిన నటుడు సోను సూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తన ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 500 మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ చికిత్స చేయించినట్లు ఆయన వెల్లడించారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన వైద్యం పొందలేకపోతున్న మహిళలను గుర్తించి, వారికి పూర్తిస్థాయి చికిత్స అందించినట్లు తెలిపారు. అలాగే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ముందస్తు పరీక్షలు, సమయానికి చికిత్స తీసుకుంటే క్యాన్సర్‌ను జయించవచ్చని సోను సూద్ అన్నారు. భవిష్యత్తులో కూడా మహిళల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సేవలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు.
సోను సూద్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలపై అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.









