కారేపల్లిలో ఏసీబీ దాడి – ఆర్‌ఐ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్
ఖమ్మం,ఆధాబ్ న్యూస్:
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించి, కారేపల్లి ఆర్‌ఐ దౌలూరి శుభకామేశ్వరి దేవీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ జారీ చేయడానికి ఒక వ్యక్తి నుంచి రూ.10,000 లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేశారు. లంచం మొత్తం స్వాధీనం చేసుకుని ఆర్‌ఐని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Post Views: 37









