మణుగూరుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
మణుగూరు,ఆధాబ్ న్యూస్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మణుగూరు పట్టణానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకొని, తెలంగాణ సంస్కృతి, హక్కులు, సంక్షేమ అంశాలపై ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను స్థానిక జాగృతి నేతలు వేగవంతం చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Post Views: 48









