ఆర్టీసీ ఎండి వై నాగిరెడ్డి మణుగూరు డిపో పర్యటన
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి మణుగూరు డిపోలో పర్యటించారు. మేడారం పర్యటనలో భాగంగా మణుగూరు డిపోను సందర్శించినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా డిపోలోని బస్సుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆర్టీసీ ఎండి సమీక్షించారు. మేడారం జాతర నేపథ్యంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Post Views: 37









