ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలో దిగిన వెంకటేశ్వర్లుకు పరాజయం
సూర్యాపేట (ఆధాబ్ న్యూస్):
సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటేశ్వర్లు కేవలం పది ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి వ్యక్తిగతంగా మద్దతు ప్రకటించినప్పటికీ వెంకటేశ్వర్లుకు విజయం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నాగయ్య చేతిలో ఆయన ఓడిపోయారు.
వెంకటేశ్వర్లుకు ఉద్యోగ పదవీకాలం ఇంకా ఐదు నెలలు మిగిలి ఉండగా స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకుని ఎన్నికల బరిలో దిగడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. చివరి వరకూ హోరాహోరీగా సాగిన పోటీలో తక్కువ ఓట్ల తేడాతో ఓటమి ఎదురవడం ఆయన అనుచరుల్లో నిరాశకు కారణమైంది.
Post Views: 34









