అశ్వరావుపేటలో బాతుల పెంపకంపై ఆసక్తి చూపిన జిల్లా కలెక్టర్. జితేష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
అశ్వరావుపేట మండలంలో పంచాయతీ ఎన్నికల పరిశీలనలో భాగంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మార్గమధ్యంలో పొలాల వద్ద బాతులను మేపుతున్న కాపరి వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా బాతుల పెంపకం విధానం, వాటికి అందిస్తున్న ఆహారం, సంరక్షణ పద్ధతులు, వ్యాధుల నివారణ చర్యలు, మార్కెట్లో లభించే ధరలు, ఆదాయ సాధన అవకాశాలపై ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో బాతుల పెంపకం తక్కువ ఖర్చుతో నిర్వహించగల ఉపాధి కార్యక్రమమని కలెక్టర్ తెలిపారు. రైతులు, పశుపాలకులకు ఇది అదనపు ఆదాయ వనరుగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అవసరమైన అవగాహన, ప్రభుత్వ పథకాల సహకారంతో బాతుల పెంపకాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు.
Post Views: 74









