ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సమత్ మోతెలో ఆసక్తికర పరిస్థితి — బ్యాలెట్ ఓటుతో ‘బ్యాలెట్ పుల్లయ్య’ గెలుపు

సమత్ మోతెలో ఆసక్తికర పరిస్థితి — బ్యాలెట్ ఓటుతో ‘బ్యాలెట్ పుల్లయ్య’ గెలుపు

కరకగూడెం, డిసెంబర్ 12 (ఆధాబ్ న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని సమత్ మోతె (గొల్లగూడెం) గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎనిమిదో వార్డులో అరుదైన, ఆసక్తికర పరిస్థితి చోటుచేసుకుంది. ఇద్దరు వార్డు సభ్యులకు సమాన ఓట్లు రావడంతో ఫలితం బ్యాలెట్ ఓటుపై ఆధారపడింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్‌ఎస్ అభ్యర్థి మలకం పుల్లయ్య బ్యాలెట్ ఓటుతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఒక్క ఓటు ఆధారంగా మారడంతో గ్రామంలో ఇది చర్చనీయాంశంగా మారింది.

దరువు సినిమాలో రవితేజ ఒకే ఒక్క ప్రాణంతో బతికే సన్నివేశం లాగే— ఈ వార్డులో కూడా పుల్లయ్య ఒకే ఓటుతో గెలుపు సాధించడంతో ప్రజలు ఆయనను సరదాగా “బ్యాలెట్ పుల్లయ్య” అని పిలుస్తున్నారు.

ఒక్క ఓటు ఎంత విలువైనదో ఈ వార్డు ఫలితం మరోసారి నిరూపించిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!