ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం ప్రజాభిమానానికి సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కృతజ్ఞతలు

 

కరకగూడెం ప్రజాభిమానానికి సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కృతజ్ఞతలు

కరకగూడెం, డిసెంబర్ 12 (ఆధాబ్ న్యూస్):
స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయం సాధించిన నేపథ్యంలో కరకగూడెం నాయకుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మండల ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసం తాను మరింత బాధ్యతతో పనిచేసేలా ప్రేరణనిస్తోందని అన్నారు.

కరకగూడెం మేజర్ గ్రామపంచాయతీ ప్రజలు చూపిన విశ్వాసానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ—
“మీ విశ్వాసమే మా బలం, మీ అభివృద్ధి మా లక్ష్యం. కరకగూడెం మండలం అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుండి ప్రజలతో కలిసి పనిచేస్తాం,” అని హామీ ఇచ్చారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించిన ప్రజల తీర్పు తమకు మరింత ఉత్సాహాన్నిస్తోందని ఆయన పేర్కొన్నరు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!