ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఇండిగో విమానాల రద్దు ప్రభావం: దేశవ్యాప్తంగా ప్రీమియం రైళ్లలో కోచ్‌ల పెంపు

ఇండిగో విమానాల రద్దు ప్రభావం: దేశవ్యాప్తంగా ప్రీమియం రైళ్లలో కోచ్‌ల పెంపు
న్యూఢిల్లీ,ఆధాబ్ న్యూస్:

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల రద్దీ పెరగడంతో రైల్వే శాఖ అత్యవసర చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా దేశవ్యాప్తంగా 37 ప్రీమియం రైళ్లలో మొత్తం 116 అదనపు కోచ్‌లు జోడిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కోచ్‌లు డిసెంబర్ 10 వరకు 10 ప్రధాన రూట్లలో అందుబాటులో ఉంటాయి.

దక్షిణ రైల్వే 18 రైళ్లలో సామర్థ్యాన్ని పెంచగా, తూర్పు రైల్వే 3 కీలక రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లను జోడించింది. నార్తర్న్‌ రైల్వే 8 రైళ్లలో థర్డ్‌ ఏసీ, చైర్‌కార్‌ కోచ్‌లను పెంచింది. పశ్చిమ రైల్వే థర్డ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ కోచ్‌లను అదనంగా జత చేయగా, ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే పలు రూట్లలో సెకండ్‌ ఏసీ కోచ్‌లను పెంచింది.

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!