సికింద్రాబాద్లో భారీ హవాలా రాకెట్ బస్టు — కారులో రూ.4 కోట్లు స్వాధీనం
హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్:
సికింద్రాబాద్ పరిధిలో హవాలా ద్వారా డబ్బు తరలిస్తున్న ముఠాను బోయిన్పల్లి పోలీసులు రంగంలో దిగి పట్టుకున్నారు. కారులో నగదును తరలిస్తున్నట్టు గుప్త సమాచారం అందడంతో, పోలీసులు వాహనాన్ని దాదాపు 15 కిలోమీటర్ల వరకు చేజ్ చేసి అడ్డగించారు.
తదుపరి తనిఖీల్లో, కార్ డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో కనిపించకుండా ప్రత్యేకంగా ఖాళీలు తయారు చేసి నగదు కట్టలు దాచినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం వాహనాన్ని పూర్తిగా ఓపెన్ చేయించి నిర్వహించిన తనిఖీలో రూ.4 కోట్ల హవాలా నగదు బయటపడింది.
ఈ హవాలా ముఠా ఎక్కడి నుండి డబ్బు తెచ్చింది? ఎవరికి పంపాల్సింది? అనేదానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అరెస్టయిన వ్యక్తులను విచారణ కోసం స్టేషన్కు తరలించారు.
Post Views: 28









