ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం ఆడబిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా.

కరకగూడెం ఆడబిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పోలేబోయిన సుజాత గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు.

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ నేతృత్వంలో జరిగిన ఈ ప్రచారంలో, ప్రజలను ఉంగరం గుర్తుపై ఓటు వేసి సుజాతను గెలిపించాలని కోరారు. “కరకగూడెం ఆడబిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి” అంటూ నాయకులు వినతిపూర్వకంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల నాయకులు ఎర్ర సురేష్, జలగం కృష్ణ, జట్ల సత్యం, బిలపాటి సంపత్, వార్డు సభ్యుల అభ్యర్థులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!