ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే సమాచారమివ్వండి: ఇన్‌చార్జ్ ఏఈ నరహరి రాజశేఖర్

కరకగూడెం మండలంలో వరుసగా ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలు
అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే సమాచారమివ్వండి: ఇన్‌చార్జ్ ఏఈ నరహరి రాజశేఖర్

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలో ఇటీవల ట్రాన్స్‌ఫార్మర్ (DTR) దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్‌చార్జ్ ఏఈ నరహరి రాజశేఖర్ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా 25 KVA రాగి కాయిల్ (Copper Coil) ట్రాన్స్‌ఫార్మర్లు దొంగల లక్ష్యంగా మారడంతో పేద గిరిజన రైతుల వ్యవసాయ పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆయన తెలిపారు.

వరుస దొంగతనాల కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లను కొత్తవిగా ఏర్పాటు చేయాల్సి రావడం విద్యుత్ శాఖపై భారీ ఆర్థిక భారం మోపుతోందని ఏఈ పేర్కొన్నారు. ఈ ఘటనలపై ఇప్పటికే కరకగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కాగా, పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తూ దొంగల గుర్తింపునకు చర్యలు చేపట్టారు.

రాత్రి వేళల్లో గ్రామాలు, వ్యవసాయ ప్రాంతాల్లో అనుమానాస్పద వాహనాలు — ముఖ్యంగా ఆటోలు — లేదా తెలియని వ్యక్తులు సంచరిస్తున్నట్లు గమనించిన వెంటనే ప్రజలు పోలీస్ స్టేషన్కు లేదా విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలని నరహరి రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో మరిన్ని దొంగతనాలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.


Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!