భద్రాచలం వైపు అయ్యప్ప స్వాముల పాదయాత్ర
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు అయ్యప్ప స్వాములు బుధవారం భద్రాచలం తరలి వెళ్లేందుకు కాలినడకన పాదయాత్ర ప్రారంభించారు. వారి పాదయాత్ర పినపాక మండల కేంద్రానికి చేరుకోగా, రవి డయాగ్నస్టిక్ సెంటర్ యజమాని బూర రవికుమార్ స్వామి వారికి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన స్వాములకు వాటర్ బాటిల్స్ అందజేసి, కనుకగా మర్యాదపూర్వక భేటీ ఇచ్చారు. కార్యక్రమంలో స్వాములు గోసంగి సతీష్, మిట్టపల్లి సతీష్, కొమరం సాంబశివరావు పాల్గొన్నారు.
Post Views: 34









