కరకగూడెం మండలంలో కాపర్ వైర్ దొంగతనాలు ఆందోళన కలిగిస్తున్నాయి
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల పరిధిలోని మోతే పీడర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ వైర్లను దొంగిలిస్తూ స్థానిక ప్రజలను, ముఖ్యంగా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్లను రాత్రి వేళల్లో లక్ష్యంగా చేసుకుని ఈ దొంగలు దోపిడికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
గత నెలలో రేగళ్ళ గ్రామాపంచయతి పరిధిలోని మద్దలగూడెంలో జరిగిన ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనం మరిచిపోలేదు. దానితో పాటు తాజాగా మోతే పీడర్ ప్రాంతంలో మళ్లీ ఇదే తరహా దొంగతనం జరుగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తరచుగా జరుగుతున్న ఈ దొంగతనాలపై అధికారులు వెంటనే దృష్టి సారించి, సంబంధిత వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Post Views: 70









