ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం – కరకగూడెం మండలంలో ఘనంగా నిర్వహణ

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం – కరకగూడెం మండలంలో ఘనంగా నిర్వహణ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమం కరకగూడెం దివ్యాంగుల ఉపాధ్యాయురాలు విజయకుమారి అధ్యక్షతన ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి జి. మంజుల, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు టి. మోహన్ బాబు, గిరిజన పే సెంటర్ ప్రధానోపాధ్యాయుడు టి. రామచంద్ర రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ దివ్యాంగుల పిల్లల విద్య, హక్కులు, ప్రతిభ వికాసం కోసం పాఠశాలలు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పిల్లల అభివృద్ధి కోసం అందుబాటులో ఉన్న సౌకర్యాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల పిల్లల కోసం వివిధ ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి. సుజాత, డి. శ్రీనివాసరావు, గురువయ్య (MIS కోఆర్డినేటర్), CRPలు మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమం పిల్లల్లో ఆత్మవిశ్వాసం, ప్రోత్సాహం, అవగాహన పెంపొందించడంలో కీలకంగా నిలిచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!