గోల్లగూడెం వద్ద ముమ్మర వాహన తనిఖీలు — ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
మండలంలోని రంగాపురం రహదారి గొల్లగూడెం వద్ద పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ప్రతి వాహనాన్ని ఆపి, ప్రయాణికుల వివరాలు, వాహన పత్రాలు సవివరంగా పరిశీలించారు.
అవాంఛనీయ సంఘటనలను నివారించడం, చట్టవ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో కరకగూడెం ఎస్ఐ పీవీ ఎన్ రావు సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, అనుమానాస్పద వాహనాలను ఖచ్చితంగా వెరిఫై చేశారు.
పోలీసుల ఈ చర్య ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందిస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
Post Views: 64









